అల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలోని గదబపాలెం పంచాయితీ మల్లవరం గ్రామానికి చెందిన టీడీపీ మాజీ వార్డు మెంబర్ తాలాబు బాలరాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.కొయ్యూరు మండల పార్టీ అధ్యక్షుడు బిడిజన అప్పారావు ఆధ్వర్యంలో పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, అరకు పార్లమెంటు పరిశీలకులు వెంకట్రామయ్య, పాడేరు నియోజకవర్గ పరిశీలకులు సత్యారావు సమక్షంలో పాడేరు క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గతంలో వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితుడై బాలరాజు పార్టీకి చేరినట్లు తెలిపారు. భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు గాడి సత్యనారాయణ, గ్రీవెన్స్ సెల్ జిల్లా మాజీ అధ్యక్షుడు గొడ్డేటి మహేష్, రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి గోవర్ధనగిరి, సర్పంచ్ ఫోరం అధ్యక్షులు ముసిలినాయుడు, మండల కార్యదర్శి పెట్లా గాంధీ, మండల నాయకుడు ఉల్లి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ మాజీ వార్డు మెంబర్ వైసీపీలో చేరిక..
RELATED ARTICLES
