Wednesday, April 22, 2026
HomeUncategorizedప్రపంచ పవర్ లిఫ్టింగ్ పోటీలకు పి.వి.ఎం నాగజ్యోతి ఎంపిక

ప్రపంచ పవర్ లిఫ్టింగ్ పోటీలకు పి.వి.ఎం నాగజ్యోతి ఎంపిక

హర్యానా రాష్ట్రం సోనిపట్‌ లో ఆదివారం నాచురల్ స్ట్రాంగ్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిపిసి ప్రపంచ పవర్ లిఫ్టింగ్ పోటీలక సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పవర్ లిఫ్టర్ పి.వి.ఎం నాగజ్యోతి అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ప్రపంచ స్థాయి పోటీలకు అర్హత సాధించారు.దీంతో ఆమె అక్టోబర్ 19 నుండి 25 వరకు పోలాండ్ దేశంలోని పబియనీస్ నగరంలో జరగనున్న ప్రపంచ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు.
పి.వి.ఎం నాగజ్యోతి సాధించిన ఈ విజయంపై క్రీడా ప్రముఖులు, సహచరులు కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు అభినందనలు తెలియజేశారు. ప్రపంచ స్థాయిలో కూడా మెరుగైన ఫలితాలు సాధించాలని పలువురు ఆకాంక్షించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments