రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ కు విశాఖ ఎయిర్ పోర్ట్ లో ఆదివారం రాత్రి ఘన స్వాగతం లభించింది. ఎయిర్ పోర్టులో ఉత్తరాంధ్ర టీడీపీ నేతలతో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, నగర అధ్యక్షులు పట్టాభిరామ్ తదితరుల నుంచి ఘనస్వాగతం లభించింది.
సోమవారం అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద దేశంలోనే అతిపెద్ద ఆర్సెలర్ మిట్టల్ అండ్ నిప్పాన్ స్టీల్స్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపనలో పాల్గొనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర ఉక్కుమంత్రి కుమారస్వామితో కలిసి కార్యక్రమానికి హాజరు కానున్న మంత్రి లోకేష్.సోమవారం ఉదయం విశాఖ టీడీపీ కార్యాలయంలో శెట్టిబలిజ నేత దొమ్మేటి వెంకట రెడ్డి జయంతి సభలో మంత్రి పాల్గొనున్నారు.
మంత్రి లోకేష్ కు విశాఖలో స్వాగతం
RELATED ARTICLES
