Saturday, April 25, 2026
HomePoliticsAndhra Pradeshపుస్తక నిక్షిప్త కేంద్రం  నిర్వాహకులతో సమీక్ష

పుస్తక నిక్షిప్త కేంద్రం  నిర్వాహకులతో సమీక్ష

విశాఖపట్నం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్  వన్నెoరెడ్డి సతీష్ కుమార్   జిల్లా కేంద్ర గ్రంథాలయ ప్రాంగణంలో పుస్తక నిక్షిప్త కేంద్రం  నిర్వాహకులతో ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గ్రంథాలయ సేవలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది.
సమావేశంలోని ముఖ్య అంశాలపై చర్చించారు
జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు గ్రంథాలయ సేవలను చేరవేయడంలో బి.డి.సి నిర్వాహకుల పాత్ర అత్యంత కీలకమని చైర్మన్ కొనియాడారు.
 జిల్లా వ్యాప్తంగా ఉన్న 58 కేంద్రాలకు గాను, సమావేశానికి 38 మంది మాత్రమే హాజరయ్యారు. హాజరుకాని నిర్వాహకులపై  కార్యదర్శి వారిని వివరణ కోరారు. సమావేశంలో పాల్గొన్న పుస్తక నిక్షిప్త కేంద్రం  నిర్వాహకులతో చైర్మన్  వ్యక్తిగతంగా మాట్లాడారు. కేంద్రాల నిర్వహణలో  ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయాల అభివృద్ధికి మరియు పాఠకులను ఆకట్టుకోవడానికి నిర్వాహకుల నుండి సలహాలు, సూచనలను స్వీకరించారు
భవిష్యత్తు కార్యాచరణ : గ్రంథాలయ సేవలను మరింత బలోపేతం చేసేందుకు త్వరలోనే తదుపరి సమావేశం మరియు భవిష్యత్తు కార్యాచరణ విడుదల చేస్తామని చైర్మన్ వెల్లడించారు. దీని ద్వారా ప్రతి కేంద్రం నిర్దిష్ట లక్ష్యాలతో పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి  బి. కుమార్ రాజు, కార్యాలయ సిబ్బంది మరియు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పుస్తక నిక్షిప్త కేంద్రం  నిర్వహకులు  పాల్గొన్నారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments