ఈనెల 23 ,24 ,25 తేదీలలో ప్రతి గ్రామాలలో రైతన్న మీకోసం రెండో విడత వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని హార్టికల్చర్ అసిస్టెంట్ బి. గంగా భవాని శుక్రవారం తెలిపారు. చిడికాడ మండలం మంచాల గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ,నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు లభిస్తుందన్నారు.ఈ ఐదు అంశాలపై ప్రతి రైతు కుటుంబాన్ని సందర్శించి చర్చించడం జరుగుతాదన్నారు.ఈ ఐదు అంశాలకు సంబంధించిన ముఖ్యమంత్రి లేఖను ప్రతి రైతు కుటుంబానికి అందించడంతో పాటు ఈ వేసవిలో పి ఎం డి ఎస్ సాగు విధానాన్ని రైతులు అవలంబించేలా నీటి ఎద్దడిని తట్టుకునే పంటలను సాగు చేసే విధంగా రైతులకు సలహాలు సూచనలు చేస్తామన్నారు.
గ్రామస్థాయిలో వ్యవసాయ అనుబంధ రంగాల కు సంబంధించిన సిబ్బంది ప్రకృతి వ్యవసాయ సిబ్బందిని, రెవెన్యూ సిబ్బందిని, అభ్యుదయ రైతులను టీంలు ఏర్పాటు చేశారు.
ఈ వారోత్సవాలు పూర్తయిన తర్వాత గ్రామాల వారీగా ఖరీఫ్ కి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలను చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది,కోటేశ్వరరావు, ఎస్ ,గౌర్నాయుడు, సుభాషిని, పి ,సత్యవతి , సత్తిబాబు, ఆర్ .పార్వతి, శ్రీరామలక్ష్మి, గంగాభవాని, గాలి సన్యాసిరావు, వరలక్ష్మి,పాడి రైతులు పాల్గొన్నారు.
ఈనెల 23 నుంచి రైతన్న మీకోసం మరు విడత వారోత్సవాలు
RELATED ARTICLES
