Wednesday, April 22, 2026
HomePoliticsAndhra Pradeshనిడదవోలు కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

నిడదవోలు కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

నిడదవోలు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ కోఆర్డినేటర్ మేడవరపు భద్రం దొర ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశం ఈ రోజు గణతంత్ర దినోత్సవాన్ని గర్వంగా జరుపుకుంటోందంటే అది అనేకమంది మహానుభావుల ప్రాణత్యాగాల ఫలితమని అన్నారు. ప్రపంచంలోనే అద్భుతమైన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఈ రోజును స్మరించుకుంటూ, రాజ్యాంగ రూపకల్పనకు 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు శ్రమించిన బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ను ఘనంగా స్మరించారు. రాజ్యాంగం దేశ ప్రజలకు సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం అందించిన మహత్తర గ్రంథమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చిన్నం మురళీకృష్ణ, పెరవలి మండల అధ్యక్షులు బుద్దున లక్ష్మణరావు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ బషీర్, మైనారిటీ సెల్ అధ్యక్షులు అన్వర్ ఖాన్, మహమ్మద్ అబ్దుల్లా, ఎస్సీ సెల్ అధ్యక్షులు కాకి కిషోర్, బీసీ సెల్ అధ్యక్షులు పెంచేటి ధరణిపతి, సీనియర్ నాయకులు కొనిచెట్టి నారాయణ, వంగూరి వెంకన్నతో పాటు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments