ఎమ్మెల్యే బండారు
మాడుగుల నియోజవర్గంలో వివిధ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం ఏడు కోట్ల 89 లక్షల రూపాయలు మంజూరు చేసినట్టు స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మంగళవారం తెలిపారు. మొత్తం నాలుగు మండలాల పరిధిలో సుమారు 90 కిలోమీటర్ల మేర 13 రహదారులు అభివృద్ధికి ఈ నిధులు మంజూరయ్యాయని తెలిపారు. వాటిలో చీడికాడ మండలం వరహాపురం నుండి విజయరామరాజుపేట మీదుగా తుని వలస వరకు 13 . 840 కిలోమీటర్ల రహదారి అభివృద్ధికి మూడు కోట్ల రూపాయలు, బి ఎన్ రోడ్డు నుండి అప్పలకొండ మీదుగా కోణం వెళ్లేందుకు 14.4 కిలోమీటర్ల రహదారి అభివృద్ధికి రెండు కోట్ల 85 లక్షలు, 3. 785 కిలోమీటర్ల మాడుగుల బ్రాంచి రోడ్డు నిర్మాణానికి 60 లక్షల రూపాయలు, సబ్బవరం నుంచి కొత్తవలస రోడ్డు. 5.8 కిలోమీటర్ల రహదారి అభివృద్ధికి 40 లక్షల రూపాయలు, మాడుగుల మండలం గొట్టివాడ మీదుగా వడ్డాది కింతలి రోడ్డు అభివృద్ధికి 8.4 కిలోమీటర్ల కు 40 లక్షల రూపాయలు,గవరవరం నుండి కాశీపురం వరకు 3. 470 కిలోమీటర్ల రోడ్డు అభివృద్ధికి 25లక్షల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు.అలాగే రావికమతం నుండి కింతలి 3.250 కిలోమీటర్ల రోడ్డు మరమ్మత్తుకి 6 లక్షలు,మాడుగుల.నుండి దబ్బగుంట రోడ్డు మీదుగా కే జే పురం వరకు 4 కిలోమీటర్ల రోడ్డు మరమ్మత్తుకు 5 లక్షలు,దేవరపల్లి పెద్దకోట రోడ్డు నుండి పినకోట 4.5 కిలోమీటర్ల రోడ్డు మరమ్మత్తుకి 5 లక్షలు,పెద్దగోగాడ నుండి తెనుగుపూడి ,తిరువోలు రోడ్డువరకు 7 .486 కిలోమీటర్ల రోడ్డు మరమ్మత్తుకి 5 లక్షలు,రావికమతం రోడ్డు నుండి ఒమ్మలి , వి జే పురం వరకు 3 కిలోమీటర్ల రోడ్డుకి 5 లక్షలు,వడ్డాది..కింతలి ఆర్ అండ్ బి రోడ్డు నుండి జి మాడుగుల బోర్డర్ వార్డున్ 3 కిలోమీటర్ల రోడ్డు కి 8 లక్షలు,చీడికాడ నుండి కోణం మీదుగా మంచాల వరకు రోడ్డు మాత్రమ్మత్తుకి 7.6 కిలోమీటర్ల.రోడ్డుకి 5 లక్షలు,వెంకన్నపాలెం నుండి ఆనందపురం వరకు 3.9 కిలోమీటర్ల రోడ్డు అభివృద్ధికి 5 లక్షలు మంజూరయ్యని ఎమ్మెల్యే తెలిపారు.
