మండలంలోని పి.భీమవరం రోడ్డులో భీమ లింగేశ్వర స్వామి ఆలయం వద్ద గురువారం 150 మంది శివ మాల ధారణ చేశారు.కోమల్లపూడి,గంటి కొర్లం, పొట్టిదొరపాలెం,తదితర గ్రామాల శివ భక్తులు మాలధారణ గావించి శివదీక్ష ప్రారంభించారు. స్థానిక పుష్కరిణిలో స్నానమాచరించి పూజలు జరిపి,మాజీ ఎంపీపీ,గురు స్వామి ఎంవీవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో శివమాల ధారణ చేశారు.వీరు తొమ్మిది రోజులపాటు ఉపవాస దీక్షలతో శివుడికి పూజలు జరిపి మాల ధారణ విరమించనున్నారు.కోమళ్లపూడిలో నూతనంగా నిర్మించిన జ్యోతిర్లింగాలు, పుష్కరిణిలో శివపార్వతుల విగ్రహాలు, ధ్వజస్తంభం, సింహద్వారం ఈనెల 25,26,27 తేదీలలో ప్రారంభించనున్నారు.ఈ సందర్భంగానే వీరు శివ మాలధారణ చేసారు. విశాఖ డెయిరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణ, ఎల్బీ పురం మాజీ సర్పంచ్ తమరాన దాసు, తదితరులు పాల్గొన్నారు.
