Home Politics Andhra Pradesh త్వరలో డుడుమా బస్సు షెల్టర్ ప్రారంభం

త్వరలో డుడుమా బస్సు షెల్టర్ ప్రారంభం

0

ముంచంగిపుట్టు మండలం వనగుమ్మ పంచాయతీ పర్యాటక ప్రాంతం డుడుమాలో జిల్లా పరిషత్ నిధులతో నిర్మిస్తున్న బస్సు షెల్టర్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జెవివిఎన్ మూర్తి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్సు షెల్టర్ నిర్మాణం పనులు తుది దశకు చేరుకున్నాయని త్వరలోనే ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. రూ.5 లక్షలతో నిర్మాణం చేపట్టిన ఈ బస్సు షెల్టర్ పెయింటింగ్స్ పనులు మిగిలి ఉన్నాయని వాటిని కూడా పూర్తిచేసి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర చేతుల మీదగా ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. ఇక్కడకొచ్చే పర్యాటకులు అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో జిల్లా పరిషత్ చైర్పర్సన్ షెల్టర్ కు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version