Home Uncategorized జోగి రమేష్ అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం.- పెండ్ర వీరన్న

జోగి రమేష్ అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం.- పెండ్ర వీరన్న

0

విజయవాడ జయ జయహే: వైస్సార్సీపీ నాయకులు మాజీ మంత్రి జోగి రమేష్ ను అక్రమ కేసులో అరెస్టు చేసిన సందర్భంగా ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్, వైసీపీ ఎంబీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సంచార జాతుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పెండ్ర వీరన్న ఒక ప్రకటన విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అండతో జరుగుతున్న కల్తీ మద్యం ఏరులై పారుతుంది కానీ కుటమి ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేకపోగా, అధికార పార్టీ నాయకులు చేస్తున్న అరాచకాలను,ప్రతిపక్ష పార్టీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై రుద్దుతూ టార్గెట్ చేస్తున్నారని కూటమి ప్రభుత్వం తీరు సమాజం గమనిస్తుందని అన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రిగా అధికార పక్షం చేస్తున్న కుట్రలను ఎత్తుచూపుతూ పోరాటం చేస్తున్నాడనే ఉద్దేశంతో, బలహీనవర్గాల నాయకుడు జోగి రమేష్ ను టార్గెట్ గా చేసి రాజకీయంగా అనగదొక్కలన్న ఉద్దేశంతో, అధికార తెలుగుదేశం పార్టీ నాయకుడు జనార్దన్ రావు కల్తీ మద్యం వ్యవహారంలో డైరెక్ట్ గా దొరికితే ఆయనకు,మాజీమంత్రి జోగి రమేష్ కి సంబంధం ఉందని జోగి రమేష్ పై తప్పుడు కేసులు పెట్టి కూటమి ప్రభుత్వం అరెస్టు చేయటం దారుణమని ఆయన అన్నారు. జోగి రమేష్ కు కల్తీ మద్యం లో దొరికిన జనార్దన్ రావుకు ఎటువంటి సంబంధం లేదని ,జోగి రమేష్ విజయవాడ దుర్గ గుడిలో కుటుంబ సమేతంగా ప్రమాణం చేసారని, కూటమి ప్రభుత్వం నిరూపించలేకపోయినప్పటికీ తప్పుడు కేసు పెట్టి ఆయనను అక్రమ అరెస్టు చేసారని , పెండ్ర వీరన్న అన్నారు. అధికారంలోకి రావడం కోసం అబద్ధపు హామీలు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారులకు వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను పక్కనపెట్టి కమిషన్ మీద ఆధారపడి నాయకులు పనిచేస్తున్నారని ఆ విధానానికి ప్రభుత్వం అండగా ఉందని పెండ్ర వీరన్న అన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు ప్రజలు గమనిస్తున్నారని రానున్న కాలంలో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని ఆయన అన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version