Home Politics Andhra Pradesh గిరిజన గ్రామాల అభివృద్ధే జడ్పీ చైర్ పర్సన్ సుభద్ర ధ్యేయం

గిరిజన గ్రామాల అభివృద్ధే జడ్పీ చైర్ పర్సన్ సుభద్ర ధ్యేయం

0

రాములు గ్రామంపై ఎప్పటికీ మా ప్రేమ తగ్గదు: వైఎస్ఆర్సీపీ జిల్లా నేత జె.వి.వి.ఎన్ మూర్తి సిసి రోడ్డు నిర్మాణానికి జడ్పీ నిధుల బాధ్యత నాదేనని హామీ కించాయిపుట్టు పంచాయతీ రాములు గ్రామంపై తమకు ఎప్పుడూ ప్రేమ ఉంటూనే ఉంటుందని, అది ఎప్పుడూ తగ్గబోదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నేత , జడ్పీ చైర్పర్సన్ సుభద్ర భర్త జె.వి.వి.ఎన్ మూర్తి స్పష్టం చేశారు. కేవలం గ్రామాభివృద్ధే ధ్యేయంగా సుభద్ర నిరంతరం పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాంగి పద్మా రెడ్డి ఆధ్వర్యంలో రాములు గ్రామంలో పార్టీ నాయకులు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మూర్తి గ్రామస్తులతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అడగకుండానే అభివృద్ధి పనులు: ఈ పర్యటనలో గ్రామస్తులు జడ్పీ చైర్పర్సన్ సుభద్రకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. “గతంలో మేము అడగకుండానే మా గ్రామానికి సిసి రోడ్డు మంజూరు చేశారు. ఇప్పుడు కూడా మా విన్నపం లేకుండానే మూర్తి స్వయంగా గ్రామానికి వచ్చి మా కష్టసుఖాలు తెలుసుకుంటున్నారు,” అని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. తమ గ్రామం కోసం పనిచేస్తున్న సుభద్రకి కృతజ్ఞతలు తెలిపారు. రోడ్ల నిర్మాణానికి హామీ గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు గ్రామంలో మరింత అభివృద్ధి పనులు చేపట్టేందుకు, ముఖ్యంగా సిసి రోడ్డు నిర్మాణానికి అవసరమైన సహకారం అందిస్తామని మూర్తి హామీ ఇచ్చారు. గ్రామస్తులు దృష్టికి తెచ్చిన ఇతర సమస్యలను పరిష్కరిస్తామని, సిసి రోడ్డుకు జిల్లా పరిషత్ ( జడ్పీ ) నుంచి నిధులు మంజూరు చేయించే బాధ్యతను తాను వ్యక్తిగతంగా తీసుకుంటానని ఆయన భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గొల్లోరి సన్యాసిరావు, చెండా పాపారావు, పంచాయతీ కో-ఆర్డినేటర్ గంపరాయి ధనార్ధన్ , రొబ్బ రాజారావు మరియు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version