Home Politics Andhra Pradesh స్వచ్ఛ రథాలను ప్రారంభించిన గంటా

స్వచ్ఛ రథాలను ప్రారంభించిన గంటా

0

భీమిలి నియోజకవర్గంలోని మూడు మండలాలకు సంబంధించిన స్వచ్ఛ రథాలను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు. ఎంవీపీ కాలనీలోని నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాలకు కేటాయించిన స్వచ్ఛ రథం ఆటోలను పరిశీలించారు. అనంతరం అందులోని నిత్యావసరాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇళ్లలోని చెత్తకు బదులుగా కొబ్బరినూనె, సబ్బులు, బిస్కట్ తదితరాలను అందజేస్తారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం స్వచ్ఛ రథాలను ప్రవేశపెట్టిందని, ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని గంటా పిలుపునిచ్చారు. నెలలో 25 రోజులు ఈ వాహనాలు గ్రామాల్లో తిరుగుతాయని, మిగిలిన రోజుల్లో ఎం.పి.డి.ఓ. కార్యాలయాల్లో ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో భీమిలి ఎం.పి.డి.ఓ.లు నరసింహారావు, జానకి, రూపేష్, జడ్పీటీసీ గాడు వెంకటప్పడు, కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, సరగడ అప్పారావు, తాట్రాజు అప్పారావు, కోరాడ రమణ, కసిరెడ్డి దామోదరరావు, లొడగల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version