ప్రైమరీ హెల్త్ సెంటర్లో ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా అగనంపూడి,ఫార్మాసిటీ కాలనీ, లంకెలపాలెం ఏరియాలో స్వర్ణ వార్డు పరిధిలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్స్ సమక్షంలో విశాఖ పార్లమెంటరీ టిఎన్టియుసి అధికార ప్రతినిధి బలిరెడ్డి సత్యనారాయణ స్థానిక యూపీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రేవు దివ్యలత ని ఘనంగా సన్మానం చేయడం జరిగినది. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలో మానవ అవసరాలకు వైద్య ఆరోగ్యశాఖ, విద్యాశాఖ కీలకమని కరోనా టైం లో ఏఎన్ఎంలు ఆశా వర్కర్స్ తమ ప్రాణాల్ని ఫణంగా పెట్టి కరోనా సోకిన పేషెంట్లకు విశిష్ట సేవలు అందించారని అన్నారు.
డాక్టర్ రేవు దివ్యలత మాట్లాడుతూ 1950 సంవత్సరం ఏప్రిల్ 7 వ తేదీన ఐక్యరాజ్యసమితి వైద్య ఆరోగ్య శాఖ నిబంధనలను ఇంప్లిమెంట్ చేసిన తేదీని ప్రపంచ ఆరోగ్య దినోత్సవం గా ప్రకటించడం జరిగినది. నేడు పి ఎం రాష్ట్ర సీఎం ఆరోగ్యం ప్రధాన ప్రాధాన్యతగా ఎన్నో స్కీములు పెట్టి ప్రజలకు సేవ చేస్తున్నారని అన్నారు. స్టీల్ ప్లాంట్ యూనియన్ నాయకులు శనివాడ చిన్నారావు, విశాఖ పార్లమెంటరీ టిడిపి నాయకులు పూడి సత్యరావు, ఏఎన్ఎం లు వరలక్ష్మి రమాదేవి రత్నం ఇందిరా సుహాసిని ఆశ వర్కర్స్ తోకాడ ఈశ్వరమ్మ సరిత జ్యోతి లక్ష్మి పాల్గొన్నారు
యు.పి.హెచ్.సిలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
RELATED ARTICLES
