Home Politics Andhra Pradesh ప్రభుత్వ పాఠశాలలల్లో మహిళా దినోత్సవం వారోత్సవాలు.

ప్రభుత్వ పాఠశాలలల్లో మహిళా దినోత్సవం వారోత్సవాలు.

0

అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారోత్సవాల సందర్భంగా కొయ్యూరు పోలీసుల ఆధ్వర్యంలో మండలం లోని కస్తూరిబాయి పాఠశాల, ప్రభుత్వ హై స్కూల్ మరియు జిటిడబ్ల్యూ పాఠశాలలో వ్యాసరచన, వక్తృత్వం మరియు చిత్రలేఖన పోటీలు నిర్వహించబడినవి.
మహిళా సాధికారత, మహిళల భద్రత, సమాన హక్కులు వంటి అంశాలపై విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. విద్యార్థుల్లో మహిళల పట్ల గౌరవ భావన పెంపొందించడం మరియు మహిళా హక్కులపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం అని తెలిపారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు పోలీసు సిబ్బంది సహకారంతో కార్యక్రమం నిర్వహించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version