చోడవరం భాష్యం స్కూల్‌లో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్కూల్ ప్రిన్సిపాల్ కె. సంతోష్ కుమార్ అధ్యక్షత వహించారు. కార్యక్రమాన్ని హెడ్ మిస్ట్రెస్ పీ. కావ్య సమన్వయం చేశారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో గొప్పదని తెలిపారు. మహిళలు విద్య, ఉద్యోగం, కుటుంబం వంటి అన్ని రంగాల్లో విజయాలను సాధిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు.
కార్యక్రమంలో భాగంగా విజయవంతమైన మహిళల కథలను వివరిస్తూ వారి పట్టుదల, కృషి, ధైర్యం ద్వారా వారు ఎలా విజయాన్ని సాధించారో తెలియజేసి అందరికీ ప్రేరణ కలిగించారు.భాష్యం స్కూల్ అభివృద్ధిలో మహిళా ఉపాధ్యాయులు, మహిళా సిబ్బంది పాత్ర చాలా ముఖ్యమని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.
అలాగే మహిళా ఉపాధ్యాయులతో కేక్ కట్ చేయించి, వినోదాత్మక ఆటలు కూడా నిర్వహించారు. ఈ ఆటల్లో మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
