Home Uncategorized ప్రజలు మద్దతుతో ఉద్యమిస్తాం-బూడి ముత్యాల నాయుడు

ప్రజలు మద్దతుతో ఉద్యమిస్తాం-బూడి ముత్యాల నాయుడు

0

దేవరాపల్లి, జయజయహే : బడుగు బలహీన వర్గాల పేద ప్రజల మద్దతుతో కూటమి పాలన వ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తామని మాజీ డిప్యూటీ సీఎం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల సలహా సంఘం సభ్యులు బూడి ముత్యాల నాయుడు ద్వజమెత్తారు. ఎంపీపీ సర్పంచ్ చింతల బుల్లి లక్ష్మీ చింతల వెంకటరమణ ఆధ్వర్యంలో మండలంలోని ఏ. కొత్తపల్లి గ్రామంలో శనివారం కోటి సంతకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై బూడి మాట్లాడారు. పేద వైద్యవిద్యార్థులకు అభ్యున్నతికి విద్యా వైద్యం అందించాలని దృఢ సంకల్పంతో వైయస్ జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజ్ లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పేద విద్యార్థులకు వైద్య అభ్యసించకూడదనే దురుద్దేశంతో కూటమి ప్రభుత్వం కాలేజీలను రద్దు చేసే దిశగా పావులు కదుపుతుందని ఆయన విమర్శించారు. కూటమి దుశ్చర్యలను, అన్యాయాలను ప్రజలకు వివరిస్తూ ఉద్యమాన్ని బలోపేతం చేస్తామన్నారు. అనంతరం రచ్చబండ వద్ద ప్రజలతో సమావేశమై కూటమి నాయకులు చేస్తున్న కుటిల రాజకీయాలను వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కర్రి సత్యం, మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూరె బాబురావు, ఆ పార్టీ సీనియర్ నాయకులు పండూరి నాయుడు, పెద్దాడ ఈశ్వరరావు, కంచిపాటి వెంకటరమణ, లక్కరాజు పెద్ది నాయుడు విద్యార్థులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version