Home Politics Andhra Pradesh లేబర్ కోడ్స్ రద్దు చేయాలని హోరెత్తిన విశాఖ నగర కార్మిక సంఘాలు గర్జన

లేబర్ కోడ్స్ రద్దు చేయాలని హోరెత్తిన విశాఖ నగర కార్మిక సంఘాలు గర్జన

0

విశాఖపట్నం జయ జయహే
కేంద్ర ప్రభుత్వం అమ్ములు చేయాలనుకుంటున్న కార్మికులకు నాలుగు లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలని దేశవ్యాప్తంగా 30 కోట్ల మంది కార్మికులు ఉదయించి ఉద్యమించారు నేడు. విశాఖ నగరంలో ఏఐటీయూసీ, సిపిఐ,సిపిఎం, ఐ ఎన్ టి యు సి, కిసాన్ సంఘాలు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని
నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వక్తగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నరసింగరావు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనుశాస్త్ర విధానంతో కార్మిక లోకాన్ని అణిచివేయాలని రాజ్యాంగాన్ని మార్చే కుట్ర ప్రారంభమైంది
అది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీకి కలగానే మిగులుతుంది. కార్మికులంటే దేశానికి వెన్నుముక్కలాంటి వారిని నరేంద్ర మోడీ తెలుసుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులని ధర్నాలో నోటీసులు ఇచ్చిన30 వేల మంది కార్మికులు సమ్మె ధర్నాలో పాల్గొన్నారు కార్మికులకు అన్యాయం చేయాలని తలబడితే కార్మిక హక్కులు రక్షించుకొనే తీరుతాం. ప్రభుత్వాలకి అడ్రస్ లేకుండా చేసే శక్తి సామర్థ్యం కార్మికులకు ఉంది. శ్రామిక కార్మికులను కట్టు బానిసలుగా చేసే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా ప్రవర్తిస్తుంది ఇప్పటికే ఉపాధిహామీ పథకాన్ని ధ్వంసం చేసింది ఇప్పటివరకు గ్రామీణ పేదలకు ఉన్న ఉపాధి గ్యారెంటీ పోయింది ప్రాణాలు కోల్పోయిన అణువిద్యుత్ యజమాని ప్రజలకు నష్టపరిహారం అక్కర్లేదని అణువిద్యుత్ చట్టాన్ని మార్చింది విద్యుత్ ప్రైవేట్ సవరణ బిల్లులు పార్లమెంట్లో చట్టాలు కావడానికి సిద్ధంగా ఉన్నాయి . లేబర్ కోర్టులు తనిఖీ వ్యవస్థను నాశనం చేసింది కార్మికుల శిక్ష యజమానులకు రక్ష ఈ కోడ్స్ వల్ల లభించే కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్పొరేటర్లకుఅమ్ముడుపోయింది మన రాష్ట్రంలో టిడిపి జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్లమెంటులో లేబర్ కోడ్స్ అనుకూలంగా ఓటు వేశాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని మా శ్రామిక కార్మిక హక్కులను తక్షణమే కాపాడుకుంటాం. కేంద్ర రాష్ట్రాలకు తగిన బుద్ధి చెప్పేవరకు మా పోరాటాలు నిరంతరం సాగుతూనే ఉంటాయి. మా ఎర్రజెండా ఎజెండా శ్రామిక కార్మికులకు అండగా ఉండటమే కార్మికులు తెలిపారు. 11 కార్మిక సంఘాలు ఆశా వర్కులు అంగన్వాడీ కిషన్ సంఘాలు కార్యక్రమంలో పాల్గొన్నాయి.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version