Home Politics Andhra Pradesh టీమ్ వర్క్ అండ్ కొలాబరేషన్ స్కిల్స్” పై అవగాహనా సదస్సు

టీమ్ వర్క్ అండ్ కొలాబరేషన్ స్కిల్స్” పై అవగాహనా సదస్సు

0

పీఎం ఉషా గ్రాంట్స్ ఆధ్వర్యంలో జీఐఈఎస్ పథకం కింద జీడీసీ మహిళా కళాశాల, మర్రిపాలెం లో “టీమ్ వర్క్ అండ్ కొలాబరేషన్ స్కిల్స్” అనే అంశంపై ప్రత్యేక అవగాహనా సదస్సు నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి జీడీసీ పాడేరు ప్రిన్సిపాల్ డా. వి. చిట్టబ్బాయి అధ్యక్షత వహించారు. వర్క్‌షాప్ కన్వీనర్‌గా జీడీసీ మహిళా కళాశాల, మడిపాలం ప్రిన్సిపాల్ డా. కె. సుధ వ్యవహరించారు. కార్యక్రమ సమన్వయకర్తలుగా ఇంగ్లీష్ విభాగం లెక్చరర్ డా. జి. మేరీ పుష్ప మరియు హిస్టరీ విభాగం లెక్చరర్ భువనేశ్వరి దేవి సేవలందించారు.
ఈ వర్క్‌షాప్‌కు ముఖ్య వక్తగా సీటీసీ విశాఖపట్నం డైరెక్టర్ ఏ. శివ ప్రసాద్ హాజరై టీమ్ వర్క్ ప్రాముఖ్యతను వివిధ ఉదాహరణలతో వివరించారు. ముఖ్యంగా వలస వెళ్లే పక్షులు ‘వి ’ ఆకారంలో ఎగరడం ద్వారా సమిష్టి కృషి ఎంత శక్తివంతమో చక్కగా వివరించారు. అలాగే గ్రూప్ మరియు టీమ్ మధ్య తేడాలను స్పష్టంగా తెలియజేశారు. విద్యార్థులతో బెలూన్లు, చాక్లెట్లు వంటి కార్యాచరణల ద్వారా పాల్గొనింపజేసి, టీమ్ వర్క్ ద్వారా సాధించగల విజయాలను అనుభవాత్మకంగా చూపించారు.
విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని విలువైన జ్ఞానాన్ని పొందారు. కళాశాల సిబ్బంది అందరూ సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ వర్క్‌షాప్ విద్యార్థులలో సమన్వయం, సహకారం మరియు నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించింది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version