షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు పాక్షికంగా దగ్ధం బాధితులను పరామర్శించిన దక్షణ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి షార్ట్ సర్క్యూట్ కారణంగా పాక్షికంగా ఇల్లు దగ్దమైన బాధితులకు విశాఖ దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అండగా నిలిచారు. పేదలైన వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. 38వ వార్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక ఇళ్ళు పాక్షికంగా దగ్ధమైంది. స్పందించిన వాసుపల్లి గణేష్ కుమార్ కుమారుడు వాసుపల్లి సూర్య, దక్షణ వైసీపీ శ్రేణులతో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని బాధితులు కర్రి బేబీ, కర్రీ గంగాధర్ కిరణ్ బాబు లను పరామర్శించారు. వెంటనే తక్షణ సహాయంగా బాధితులకు 10 వేల రూపాయల నగదు అందజేశారు.
ఈ ఘటన జరగడం చాలా విచారకరమని ఆవేదన వ్యక్తం చేస్తారు. అన్ని విధాలుగా తను వారికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 38వ వార్డు వైసిపి అధ్యక్షులు గురజాపు రవి, జిల్లా జనరల్ సెక్రెటరీ గణగాళ్ల రామరాజు, చేపల నూకరాజు, అర్జున్ ప్రసాద్, పట్నాల సతీష్, శ్యామలరాలు, చేపల రాజు, అన్మోలు తదితరులు పాల్గొన్నారు.
