Home Politics Andhra Pradesh గిరిజన యువతకు ఉచిత ఆన్లైన్ కోచింగ్.

గిరిజన యువతకు ఉచిత ఆన్లైన్ కోచింగ్.

0

అరకు వేలి లో అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో, కాకినాడకు చెందిన ప్రముఖ శ్యామ్ ఇన్‌స్టిట్యూట్ సహకారంతో, అరకు వేలి మండల పరిధిలోని గిరిజన యువతకు వివిధ పోటీ పరీక్షలకు (పోలీస్, ఎస్ ఐ .ఎస్ ఎస్ సి .ఆర్ఆర్ బి మొదలైనవి) ఉపయోగపడే విధంగా ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు
ఈ కార్యక్రమం గిరిజన యువతలో విద్యా అవగాహన పెంచడం, పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలను మెరుగుపరచడం, సమాజంలో మెరుగైన భవిష్యత్తును నిర్మించుకోవడానికి దోహదపడే లక్ష్యంతో ప్రారంభించబడింది. ఈ ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ ద్వారా గిరిజన ప్రాంతాల్లోని యువతకు నాణ్యమైన విద్యా సౌకర్యాలు, నిపుణులైన బోధన, పరీక్షా సన్నద్ధత వంటివి అందుబాటులోకి వస్తాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అల్లూరి సీతారామరాజు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ అమిత్ బర్దర్ హాజరై, శ్యామ్ ఇన్‌స్టిట్యూట్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ప్రశంసించారు. యువత అంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ జీవితంలో సఫలీకృతులు కావాలని, పట్టుదలతో చదివితే సాధించలేనిది ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు. అలాంటి అద్భుతమైన సహకారాన్ని అందిస్తున్న శ్యామ్ ఇన్‌స్టిట్యూట్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
పాడేరు డి.ఎస్.పి అభిషేక్ మాట్లాడుతూ, యువత చదువు పట్ల అనాసక్తి చూపకుండా, నిత్యం చదువుతూ ఉంటే తప్పనిసరిగా విజయవంతం అవుతారని, కష్టపడి పట్టుదలగా ఉంటే ఏ లక్ష్యమైనా సాధ్యమే అని స్పష్టం చేశారు.
శ్యామ్ ఇన్‌స్టిట్యూట్ సీఈవో శ్రీనివాస్ మాట్లాడుతూ, గిరిజన యువత పట్ల పోలీసు శాఖ చూపుతున్న వాత్సల్యానికి, అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాంటి అద్భుతమైన ప్లాట్‌ఫాం‌ను గిరిజన యువతకు సృష్టిస్తున్న పోలీసు శాఖకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పోలీసు శాఖ తాము పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా, పిల్లలందరికీ నాణ్యమైన, గుణాత్మకమైన కోచింగ్‌ను అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో శ్యామ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ సుబ్రమణ్యం, అరకు వేలి స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎస్సై గోపాలరావు పాల్గొని, తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version