ఆరోగ్య శ్రీ..బీమా సంస్థలకు ఇస్తే పేదలకు వైద్యం దూరం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సిన ఎన్ టీ ఆర్ వైద్య సేవ (ఆరోగ్య శ్రీ ).. బీమా సంస్తలకు ఇస్తే పేదలకు వైద్యం దూరం అవుతుందని దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. *సూర్యబాగ్ కాలనీకి చెందిన కొండా నేస్తలు కొంత కాలంగా నిమోనియాతో చెస్ట్ ఇన్ఫెక్షన్తో బాధ పడుతున్నారు. 31 వార్డ్ వైసిపి అధ్యక్షుడు దొడ్డి బాపు ఆనంద్ ద్వారా వైసిపి వార్డు మహిళ నాయకురాలు కొండా రమా భర్త ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని శుక్రవారం కుమారుడు వాసుపల్లి సూర్యతో కలిసి మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. వారి కుటుంబానికి అండగా నిలుస్తూ ₹. 5000 /- మెడికల్ ఖర్చులకు సాయం అందించారు*. బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ పధకం నిర్వీర్యం అయిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గత వైసీపీ సర్కార్ హయంలో చికిత్సల సంఖ్య పెంచడమే కాకుండా ఆస్పత్రి లో చికిత్స వ్యయం ఏడాదికి 25 లక్షలకు పెంచిన ఘనత జగన్ దే అని గుర్తు చేశారు. ఇలాంటి పధకాన్ని కూటమి సర్కార్ బీమా సంస్థలకు అప్పగించే కుట్ర పన్నడం దురదృష్టకరం అని దుయ్య బట్టారు. పేదలకు అందాల్సిన పథకాలు వైద్యం ప్రభుత్వం బాధ్యతని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గంట శ్రీను, కండ్రగుల నాయుడు, రామ్ మాస్టర్, పిలక మోహన్, కనుకుల్లా, ధోని, మోహన్ సీపీ, త్రినాధ్, రమా, బండారు నాగరాజు,ఒమ్మి చిన్న రావు, నాగరాజు, అరుగుల రాజు, ఆకుల శ్యామ్,శ్రీనివాసు, పెంటకోట బాబు రావు, దినేష్, 31వ వార్డు వైసిపి సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
————–
