Home Politics Andhra Pradesh శ్రీ నీలమాంబ అమ్మవారి అన్నదానానికి వాసుపల్లి విరాళం

శ్రీ నీలమాంబ అమ్మవారి అన్నదానానికి వాసుపల్లి విరాళం

0

పండుగ మహోత్సవానికి ఆహ్వానించిన కమిటీ సభ్యులు  దక్షిణ నియోజకవర్గంలో *36వ వార్డు రంగిరీజు వీధిలో జరగనున్న శ్రీ నీలమాంబ అమ్మవారి 44వ పరస మహోత్సవానికి హాజరుకావాలని మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ కి కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేశారు*. ఆసిల్ మెట్ట కార్యాలయంలో ఆదివారం *మాజీ కార్పొరేటర్ కొప్పుల వెంకట్రావు ఆధ్వర్యంలో శ్రీ నీలమాంబ సేవా సమాజం సభ్యులు దానేష్ తదితరులు వాసుపల్లి నీ కలిశారు. ఈ మేరకు వాసుపల్లి సొంత నిధులతో 15వ తేదీ ఆదివారం జరగనున్న అన్న సమారాధనకు ₹. 10,000 /- విరాళం అందజేశారు*. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్కుమార్ మాట్లాడుతూ ప్రతి ఏడాది మాదిరిగా ఉత్సవం అత్యంత విజయవంతంగా జరగాలని ఆకాంక్షించారు. శ్రీ నీలమాంబ అమ్మవారి కరుణాకటాక్షం ప్రజలందరిపై ఉండాలని కోరారు. 9వ తేదీన తోలేళ్లు, పదవ తేదీన పరస మహోత్సవం జరుగుతుందన్నారు. కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు మహోత్సవానికి హాజరై తప్పకుండా అమ్మవారిని దర్శించుకుంటానని వాసుపల్లి తెలిపారు. ఈ కార్యక్రమంలో సౌత్ వేవ్స్ వింగ్ ప్రెసిడెంట్ కాకి పద్మ,కమిటీ సభ్యులు…. పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version