Home Devotional శ్రీ త్యాగరాజ స్వామి మహోత్సవానికి వాసుపల్లి విరాళం

శ్రీ త్యాగరాజ స్వామి మహోత్సవానికి వాసుపల్లి విరాళం

0

దక్షిణ నియోజకవర్గం జగదాంబ జంక్షన్ అంబికా బాగ్ లో 14వ తేదీన జరగనున్న సద్గురు *శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధన మహోత్సవానికి మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సిపి సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ రూ.10,000 విరాళం అందజేశారు. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ఆస్థాన నాదస్వరం డోలు విద్వాంసుల బృందం ఆసీలమెట్ట కార్యాలయంలో సోమవారం ఉదయం కలిశారు. వాసుపల్లి గణేష్ కుమార్ కి ఆహ్వాన పత్రికను అందజేశారు*. శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానం అమ్మవారి ఆశీస్సులతో జరుగుతున్న ఈ వేడుకలకు వాసుపల్లి గణేష్ కుమార్ ని సాదరంగా ఆహ్వానించారు. ఈ మహోత్సవాలు ఘనంగా జరగాలని అకాక్షించారు శాస్త్రీయ సాధన ద్వారా నాధోపావన గావించి శ్రీ సీతారామచంద్రస్వామి సంపూర్ణ అనుగ్రహం పొందిన త్యాగరాజస్వామి సంగీత నాదస్వర కచేరి రూపకముగా ఈ మహోత్సవాలు నిర్వహిస్తున్న బృందానికి అభినందనలు తెలిపారు. ఆధ్యాత్మికత పెంపొందించే కార్యక్రమాలకు, సేవా కార్యక్రమాలకు తన సంపూర్ణ పూర్తి మద్దతు ఉంటుందని వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version