శుక్రవారం మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా స్థానిక గౌతమీ జీవ కారుణ్య సంఘం అనాధ వృద్ధుల శరణలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ టి.కే. విశ్వేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా డాక్టర్ టి.కే. విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, అహింస, సత్యం మార్గంలో దేశాన్ని స్వాతంత్ర్యం వైపు నడిపించిన మహానుభావుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు. ఆయన చేసిన సేవలు, ఆదర్శాలు నేటి తరానికి మార్గదర్శకమని వృద్ధులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డాక్టర్స్ సెల్ జిల్లా చైర్మన్ డాక్టర్ రాజశేఖర్, ఎస్సీ సెల్ చైర్మన్ బత్తిన చందర్రావు, విజయ్ కుమార్, రాజు, గౌతమీ జీవ కారుణ్య సంఘ సిబ్బంది, డాక్టర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం శరణలయంలోని వృద్ధులకు కమలాఫలాలు పంచిపెట్టి మానవత్వాన్ని చాటుకున్నారు.
