Home Politics Andhra Pradesh నేడు నుండి స్పర్శ పై అవగాహన కార్యక్రమం

నేడు నుండి స్పర్శ పై అవగాహన కార్యక్రమం

0

ఈనెల 30 నుండి ఫిబ్రవరి నెల 13వ తేదీ వరకు స్పర్శ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు గవరవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తెలిపింది. ఈ సందర్భంగా లెప్రసీ వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా గవరవరం పిహెచ్సి ప్రాంగణంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. ఈ వ్యాధితో బాధపడుతున్న వారి పట్ల వివక్షత చూపకూడదని, ఈ వ్యాధి ఎలా గుర్తించాలి, గుర్తించిన తర్వాత దీనికి ఏ విధంగా మందులు ఇవ్వాలి అనే అంశంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. పూర్తిగా ఉచితంగా నివారణ అయ్యేందుకు హ్యాండ్సన్ అనే శాస్త్రవేత్త కనుక్కోవడం వల్ల కానీ హ్యాండ్సం వ్యాధి అని కూడా అంటారన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ చొప్పగడ్డి మాణిక్యం జడ్పీహెచ్ఎస్ స్కూల్ హెచ్ఎం గవరవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ కుమారి భారతి , డాక్టర్ శ్రీమతి సత్య దీపిక , శ్రీమతి శ్యామల సిహెచ్ఓ, హెల్త్ సూపర్వైజర్ త్రిమూర్తులు ఏఎన్ఎం ధనలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి ఈ వ్యాధి పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాలను గవరవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆయుష్ వైద్యురాలు డాక్టర్ పద్మావతి సూచించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version