Wednesday, April 22, 2026
HomePoliticsAndhra Pradeshకొయ్యురు లో మూడు పరీక్ష కేంద్రాలు..

కొయ్యురు లో మూడు పరీక్ష కేంద్రాలు..

అల్లూరి జిల్లా కొయ్యురు లో ఈనెల 16 నుంచి మండల కేంద్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మూడు పరీక్ష కేంద్రాలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. బాయ్స్ వన్ పరీక్ష కేంద్రంలో 203 మంది, గవర్నమెంట్ హైస్కూల్లో 152, ఏపీఆర్ స్కూల్ లో 210 మంది విద్యార్థులు, మొత్తం మండలంలో 565 మంది విద్యార్థులు పరీక్షలలో పాల్గొంటున్నారని తెలిపారు.
ఈసారి హాల్ టికెట్లపై ఎగ్జామ్స్ సెంటర్ ఎక్కడో తెలుసుకునేందుకు క్యూఆర్ కోడ్ ముద్రించారు. పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను హాల్ టికెట్ పై ముద్రించారు. పరీక్షలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని, ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా పరీక్షలు రాయాలని
ఏటీడబ్ల్యూఓ క్రాంతి కుమార్, సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments