Home Politics Andhra Pradesh రౌడీ షీటర్ హత్య కేసులో ముగ్గురు ముద్దాయిలు అరెస్టు

రౌడీ షీటర్ హత్య కేసులో ముగ్గురు ముద్దాయిలు అరెస్టు

0

రౌడీ షీటర్ ఉపేంద్ర హత్య కేసులో ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు కే కోటపాడు సీఐ కే కృష్ణ తెలిపారు. మంగళవారం మాడుగుల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నెల 27వ తేదీ రాత్రి మాడుగుల మండలం గాదిరాయి సమీపంలో జంపిన గ్రామానికి చెందిన రౌడీ షీటర్ పేచ్చేటి ఉపేంద్ర దారుణ హత్యకు గురయ్యాడు. ఎందుకు పాత తగాదాలే కారణం అని చెప్పారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా ఈ నెల రెండో తేదీ సాయంత్రం మాడుగుల మండలం ఘాటీ రోడ్డు జంక్షన్ లో జంపిన గ్రామానికి చెందిన ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేసి మంగళవారం రిమైండ్ తరలించడం జరిగిందని చెప్పారు. ఈ కేసు ఇంకా దర్యాప్తు సాగిస్తున్నామని ఇంకా ఎవరైనా అనుమానాలు ఉంటే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని సిఐ చెప్పారు. ఈ సమాజంలో ఎస్సై కే నారాయణ రావు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version