Home Politics Andhra Pradesh అప్పుడు బాధ తారలేక ఒక వ్యక్తి ఆత్మహత్య

అప్పుడు బాధ తారలేక ఒక వ్యక్తి ఆత్మహత్య

0

అప్పులు బాధ తాలలేక ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన చోడవరంలో జరిగింది. ఈ మేరకు సోమవారం చోడవరం పోలీసులు అందించిన వివరాలు ప్రకారం చోడవరం గండికోలనీకి చెందిన గండి మహేశ్వరరావు (60) అనే వ్యక్తి బాత్రూంకి అని ఇంటి నుండి బయటకు వెళ్ళాడు. అయితే సోమవారం ఉదయం సదరు గండి మహేశ్వరరావు చోడవరం పాత చెరువు నీటిలో చనిపోయి ఉండగా స్థానికులు చూసి, మృతుని భార్యకు తెలియజేసినట్లు పేర్కొన్నారు. మృతుడు తనకు ఉన్న అప్పుల బాధలు భరించలేక నిన్న రాత్రి పాత చెరువులో దూకి చనిపోయినట్లుగా మృతుని భార్య గండి శైలజ ఇచ్చిన ఫిర్యాదు పై చోడవరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ బి. జోగారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version