Home Politics Andhra Pradesh మానవజాతి మనుగడకు ఆధారభూతం శ్రీమద్రామాయణం

మానవజాతి మనుగడకు ఆధారభూతం శ్రీమద్రామాయణం

0

డాక్టర్ మల్లు వేంకట రెడ్డి,

సమస్త మానవజాతి మనుగడకు ఆధారభూతం శ్రీమద్రామాయణమని, మానవుడు ఎలా జీవిస్తే ఆదర్శ మానవుడవుతాడు, ఎలా నడిస్తే సమాజానికి లోక కంఠకుడవుతాడో శ్రీమద్రామాయణం వివరిస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో క్రిష్ణగిరి మండలం మన్నెగుంట గ్రామంలోని శ్రీ సుంకుల పరమేశ్వరి దేవస్థానం నందు ధార్మిక కార్యక్రమాలను మంగళవారం వారు ప్రారంబించారు. ఈ సందర్భంగా వారు ప్రారంభోపన్యాసం చేశారు. మొదటిరోజు స్వాత్మానందస్వామి ప్రవచనాలు, స్థానిక భజన మండలిచే భజన కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ఈ కార్యక్రమంలో ధార్మిక ప్రవచకులు డాక్టర్ యం మధుసూధనా చార్యులు, చిందుకూరి నడిపి వెంకటేశ్వర్లు, సి. రాముడు, కూరాకుల రాముడు, చిన్న హనుమంతు, పూల వెంకటేశ్వర్లు, పెద్దకురువ బజారి, కె. వెంకటేశ్వర్లు,పూజారి బోయ చంద్రన్న, లక్ష్మీదేవి, సి. రామలింగం తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version