Home Politics Andhra Pradesh కంచే చేను మేసినట్టు రాష్ట్ర కూటమి ప్రభుత్వం

కంచే చేను మేసినట్టు రాష్ట్ర కూటమి ప్రభుత్వం

0

తీరు . విశాఖలో బి ఎస్ పి ఆరోపణ
విశాఖ వి.జె.ఎఫ్ ప్రెస్ క్లబ్ లో బహుజన సమాజ్ పార్టీ పత్రికా సమావేశం ద్వారా
రాష్ట్ర కూటమి ప్రభుత్వం,ప్రభుత్వ భూములను ప్రైవేటు సంస్థలకు కారు చౌకగా ధారాధత్వం చేయడంను బహుజన సమాజ్ పార్టీ ఆక్షేపిస్తూ కంచే చేను మేసినట్టు రాష్ట్ర కూటమి ప్రభుత్వం
తీరు ఉందని తీవ్రంగా ఖండించింది. పెదపెంకి శివప్రసాదరావు బహుజన సమాజ్ పార్టీ ఉత్తరాంధ్ర జోన్ ఇన్చార్జ్ మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి సర్కార్ కు కేటాయించిన స్థలము అన్యాయమని , కేటాయింపులను ప్రభుత్వము వెనక్కి తీసుకోవాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇటీవల విడుదల చేసిన ప్రభుత్వం జి. ఓ యం ఎస్ నెం. 492 ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.బోని కృష్ణ బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దకపోగా నేటి కూటమి ప్రభుత్వము కూడా అదే మార్గంలో పైనించడం దురదృష్టకరం.ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ భవనాలునిర్మించుపోగా ప్రజలకు ఉన్న భూ ఆస్తిని ప్రభుత్వాలు దోచుకుంటున్నాయి, చంద్రబాబు నాయుడు లోకేష్ స్వార్థ ప్రయోజనాల కోసమే, ప్రతిఫలంగా ప్రభుత్వ భూములను ప్రవేట్ సంస్థలకు దారాదత్తం సరైనది కాదు. ప్రభుత్వ భూములను పేదల నివాస గృహములుగా వినియోగించాలి. ఇప్పటివరకు గతంలో జరిగిన భూ కేటాయింపులపై స్వతంత్ర న్యాయ విచారణ తక్షణమే జరిపి కేటాయించిన ప్రభుత్వ భూముల వివరాలు పై శ్వేత పత్రము విడుదల చేయాలిని , లేనిపక్షంలో రాష్ట్ర బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ పిలుపు మేరకు రాష్ట్రమంతటా న్యాయపోరాటం చేస్తామని విశాఖ బహుజన సమాజ్ పార్టీ హెచ్చరిక చేస్తుంది. బి. విశ్వనాధ్ బి ఎస్ పి విశాఖ జిల్లా అధ్యక్షులు, షేక్.సుభాన్ బి ఎస్ పి విశాఖ మైనార్టీ సెల్ , పెద్దాడ కనకమహాలక్ష్మి ఉత్తరాంధ్ర మహిళా కో కన్వీనర్ , నందికోలు అప్పారావు , బి ఎస్ పి నాయకులు మొదలగు వారు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version