Home Politics Andhra Pradesh ఐకమత్యంగా ఉంటేనే బ్రాహ్మణ జాతి మనుగడ

ఐకమత్యంగా ఉంటేనే బ్రాహ్మణ జాతి మనుగడ

0

అరాచకాలకు ఆందోళన చెందుతున్న బ్రాహ్మణ, అర్చక, పురోహిత సంఘాలుఐకమత్యంగా ఉంటేనే బ్రాహ్మణ జాతి మనుగడ సాగించగలదని బ్రాహ్మణ అర్చక పురోహిత సంఘాలు ఏకీకృత అభిప్రాయాన్ని వెలిబుస్తున్నాయి.ఈ మేరకు బ్రాహ్మణులందరూ ఐక్యమయ్యేందుకు చోడవరం గాయత్రి బ్రాహ్మణ ఐక్యవేదిక మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. బ్రాహ్మణ కుటుంబాలు వారి ఆస్తులు, జీవనోపాధి పైన దాడులు నానాటికి పెరిగిపోతున్నాయని,… అణగారిపోతున్న, అణచి వేయబడుతున్న బ్రాహ్మణ సమాజ పునరుద్దరణకు వేదమాత గాయత్రి పఠనం, పార్వతి పరమేశ్వరుల శరణమే రక్షణగా ఐకమత్యంగా పోరాటాలు కొనసాగించాలనేది ఆకాంక్షగా తెలియజేశారు.ఇటీవల కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం జార్జి పేట గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పనిచేస్తున్న అర్చక స్వాములు సుందర సీతారామయ్య (50) పై హత్యాయత్నానికి పూనుకున్న ఘటన మరువక ముందే…, విశాఖ 30వ వార్డు శాలిపేట లో సుమారు 120 సంవత్సరాలకు పైగా పితృ కార్యాలు (అపర కర్మలు) నిర్వహిస్తున్న, దాతలు ఇచ్చిన బోడి బంగ్లాకు కూటమి ప్రజాప్రతినిధులు మూయించారన్నారు. దాతలు ఇచ్చిన ప్రైవేటు స్థలంలో బ్రాహ్మణులు, హిందువులు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు అడ్డు తగిలి, నాలుగు గోడల మధ్య జరిగే దశదిన విధులకు ఆటంకం కల్పించడం హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీయడం అనేది చాలా దుశ్చర్యగా భావిస్తున్నామని, బోడి బంగ్లా కు అన్యాయంగా తాళం వేసిన విశాఖ 30 వార్డు కార్పొరేటర్ కోడూరు అప్పల రత్నం పై చర్య తీసుకోవాలని కోరారు. గౌరవ ఉన్నత న్యాయస్థానం నుండి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ పితృదేవతల, నిత్య విధులకు అడ్డు తగలడం అనేది రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కింద వస్తుందని, దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు. తక్షణమే అధికార కూటమి ప్రభుత్వం, జి.వీ.ఎం.సి ఉన్నతాధికారులు బంగ్లా ను తెరిపించి నిత్య కర్మ విధులు యధావిధిగా కొనసాగేటట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. బ్రాహ్మణులు, వారికి చెందిన ఆస్తులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం అరికట్ట లేకపోతే తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version