మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేయడానికే జీ-రాంజీ పథకం కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం తీసుకొని వచ్చిందని సిపిఎం పార్టీ డుంబ్రిగూడ మండల నాయకులు గసబ పంచాయతీ మాజీ సర్పంచ్ పాంగి సురేష్ కుమార్ చెప్పారు. ఈ సందర్బంగా వారు గసబ పంచాయతీ మొర్రిగూడ గ్రామ ప్రజలతో మాట్లాడుతూ. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామి చట్టాన్ని కొనసాగించాలని, జీ-రాంజీ పథకం రద్దు చేసి ఉపాధి హామీ చట్టం బలోపేతం చేయాలనీ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పేద ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందనీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు ఆర్ధిక బారం పడుతుందని చెప్పారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బిజెపి ప్రభుత్వం ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయకుండా మోసం చేసిందని విమర్శించారు. కేంద్రంలోఉన్న బిజెపి ప్రభుత్వం రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న టిడిపి, జనసేన, వైసీపీ పార్టీలు ప్రశ్నించకపోవడం దుర్మార్గం అన్నారు. ఇప్పటికైనా మేల్కొని ప్రజల పక్షాన పోరాడాలనీ చెప్పారు.ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ పాంగి రాజ్ కుమార్,సిపిఎం నాయకులు పాంగి కొత్తు, పాంగి క్రిష్ణా మూర్తి, వంతల సుబ్బారావు, పాంగి రామరావు, పాంగి దర్మరావు, వంతల సింహద్రి తదితరులు పాల్గొన్నారు.
