Home Politics Andhra Pradesh 5 వ షెడ్యూల్ ఏజెన్సీ ఆదివాసులకు 100 శాతం రిజర్వేషన్ చట్టం చేయాలి

5 వ షెడ్యూల్ ఏజెన్సీ ఆదివాసులకు 100 శాతం రిజర్వేషన్ చట్టం చేయాలి

0

ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ అమలు చేయాలి
ఆదివాసీ ప్రత్యక డీఎస్సీ నోటిపికేషన్ విడుదల చేయాలి- ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ ఆదివాసీ నిరుద్యోగుల సంఘం, ఆదివాసి స్పెషల్ డీఎస్సీ సాధన కమిటీ ఆధ్వర్యంలో
పాడేరు ఆదివాసి గిరిజన సంఘం కార్యాలయంలో ఆదివాసి నిరుద్యోగుల సంఘం ఆదివాసి స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంలో ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి బాలదేవ్ ఆదివాసి నిరుద్యోగుల సంఘం జిల్లా కన్వీనర్ ఎస్ సత్యనారాయణ ఆదివాసి స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ జిల్లా కన్వీనర్ సాగిన ధర్మపుడాల్ మాట్లాడుతూ ,ఆదివాసి ప్రాంతంలో 100% ఉద్యోగ రిజర్వేషన్ కల్పిస్తామని ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో హామీ ఇవ్వడం జరిగిందని హామీ అమలు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వలన ఆదివాసి నిరుద్యోగులు గత మెగా డీఎస్సీలో సుమారు 5 వేల మందికి ఆదివాసీ అభ్యర్థులు తీవ్ర నష్టం జరిగిందని దీని ఫలితంగా ఆదివాసి ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయి తీవ్ర నిరాశకు గురియ్యారని ఆదివాసి ప్రాంతంలో ఐటీడీఏ ల పరిధిలో ప్రాజెక్ట్ అధికారి పర్యవేక్షణలో ఆదివాసీ ప్రత్యక డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి ఆదివాసి ప్రాంతంలోఆదివాసి అభ్యర్థులకు ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం,ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోవడం చాలా బాధాకరం ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నిలబెట్టుకుని ఏజెన్సీ ప్రాంతంలో 100% ఉద్యోగ నియామక చట్టం చేసి ఆదివాసి ప్రాంతంలో ప్రత్యక డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి ఆదివాసీ నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,5 వ షెడ్యూల్ ఆదివాసీ ప్రాంతంలో సర్వ హక్కులు,అధికారాలు ఆదివాసులకు ఉన్నాయని ఉద్యోగ నియామకాల మాత్రం గిరిజనేతరులకు ఇవ్వడం ఆదివాసుల హక్కులు చట్టాలు కాలరాయడమే అవుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదివాసులకు ఇచ్చిన హామీ అమలు చేయాలని 100 శాతం రిజర్వేషన్లు కల్పించి డీఎస్సీ ప్రకటించాలని ఆదివాసీ ప్రత్యక డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయా నియమాలు చేపట్టాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు,ఈ కార్యక్రమంలో ఆదివాసి నిరుద్యోగుల సంఘం జిల్లా నాయకులు డిపి శంకర్, రాము, ప్రశాంత్, ఎస్ ఫ్ ఐ జిల్లా కార్యదర్శి కార్తీక్,ఆదివాసి గిరిజన సంఘం జిల్లా నాయకులు బోండా గంగాధర్ తదితరులు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version