Home News వాకర్స్ ఉద్యమానికి ఆధ్యుడు “జె.ఎల్. తోషినివాల్

వాకర్స్ ఉద్యమానికి ఆధ్యుడు “జె.ఎల్. తోషినివాల్

0

డాక్టర్ డి.వి.జి.శంకర్రావు
వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ ధ్వతీయ అధ్యక్షులు, కీర్తి శేషులు జానికీ లాల్ తోషిని వాల్ వర్ధంతి సందర్భంగా ఆదివారం అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ అధ్యక్షులు సి హెచ్. రమణ ఆధ్వర్యంలో 42వ డివిజన్ కామాక్షి నగర్,అయ్యన్నపేట జంక్షన్ వద్దనున్న మున్సిపల్ నడక మైదానంలో తోషిని వాల్ చిత్రపటానికి పూలమాల వేసి క్లబ్ సభ్యులంతా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన ప్రముఖ సాహితీవేత్త, ప్రముఖ వైద్యులు డాక్టర్ డివిజి శంకర్రావు మాట్లాడుతూ కీర్తి శేషులు జానికి లాల్ తోషిని వాల్ వాకర్స్ నడక ఉద్యమానికి ఆధ్యుడని, నడక ఉద్యమానికి జీవం పోశారని,తోషిని వాల్ క్రమశిక్షణకు,దాన ధర్మాలకు మారుపేరైన జానికీలాల్ తోషినీ వాల్ ప్రతీ ఒక్క నడక సభ్యులకు,నడక సంఘాలకు ఆదర్శ ప్రాయులని తోషిని వాల్ చేసిన సేవలను కొనియాడారు.
కార్యక్రమంలో సీనియర్ వాకర్ కె ఎస్ పాత్రుడు గురుమూర్తి, సత్య రావు, సత్యనారాయణ, మహేష్ మాస్టారు,భారీ సంఖ్యలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version