Home Politics Andhra Pradesh కయాకింగ్ పోటీలను ప్రారంభించిన గంటా

కయాకింగ్ పోటీలను ప్రారంభించిన గంటా

0

విశాఖ ఉత్సవ్ లో భాగంగా రుషికొండ బీచ్ లో కయాకింగ్ పోటీలను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బుధవారం ప్రారంభించారు. మొత్తం 50 మంది ఈ పోటీల్లో పాల్గొన్నారు. సింగిల్ కయాకింగ్ లో 25 మంది.. డబుల్ కయాకింగ్ లో మరో 25 మంది పోటీ పడుతున్నారు. విజేతలకు రూ.10 వేలు, రూ.5 వేల చొప్పున ప్రైజ్ మనీ అందజేయనున్నారు. పోటీల్లో పాల్గొన్న వారిని అధికారులు గంటాకు పరిచయం చేశారు. దేశంలో జరుగుతున్న అతిపెద్ద బీచ్ ఫెస్టివల్ విశాఖ ఉత్సవ్ ను విజయవంతం చేయాలని పిలునిచ్చారు. 9 రోజుల పాటు నిర్వహిస్తున్న ఉత్సవ్ లో భాగం కావడానికి ఇతర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు వస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి మాధవి, జిల్లా క్రీడల అధికారి జూన్ గాలియట్, కార్పొరేటర్ లొడగల అప్పారావు, కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, దొరబాబు తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version