Home Politics Andhra Pradesh ఆర్టీవో కార్యాలయం 9వ వార్షికోత్సవం వేడుకలు

ఆర్టీవో కార్యాలయం 9వ వార్షికోత్సవం వేడుకలు

0

వాహన దారులకు సేవలు అందించడమే మా ధ్యేయం ఆర్టీవో వి జయప్రకాష్  అగనంపూడి ఆర్టీవో కార్యాలయం 9వ వార్షికోత్సవం సందర్భంగా అగనంపూడి లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్టీవో కార్యాలయం లో కేక్ కటింగ్ కార్యక్రమం చేసారు ఈ కార్యక్రమం లో ఆర్టీవో,మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స మరియు ఆఫీస్ స్టాప్ ను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆర్టీవో వి జయ ప్రకాష్ మాట్లాడుతూ అగనంపూడి ఆర్టీవో కార్యాలయం ప్రారంభం నాటి నుండి నేటి వరకు 1 లక్ష 23 వేల 150 వెహికల్స్ కి వివిధ రకాల సేవలు అందించడం జరిగిందని వాహనదారులు కు మెరుగైన సేవలు అందించడమే మా ద్వేయమని రవాణా శాఖ నిబంధనలో అనుసరించాలని కోరారు. 9వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు ఏడిసి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్, బీహెచ్ఈఎల్, గంగవరం పోర్ట్, వి ఈ పి జెడ్, ఆటోనగర్ ప్రాంతంలో వాహనాలు ఎక్కువగా ఉండటం వల్ల వాహనదారులకు సౌలభ్యంగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని అగనంపూడిలో ఆర్టీవో కార్యాలయం 38 లక్షల ప్రభుత్వ నిధులతో కట్టించడం జరిగినది. వాహనదారుల తరఫున ఎమ్మెల్యే కు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. అగనంపూడి లారీ ఓనర్స్ సంక్షేమ సంఘం అధ్యక్షులు లక్కరాజు గోవిందరాజు సభ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గాజువాక స్టీల్ సిటీ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు నెల్లి శ్రీనివాసరావు, టిడిపి సీనియర్ నాయకులు కొర్రాయి నాగార్జున మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స డిపి రంగారావు, ఎన్ శ్రీనివాస్, జి సత్యం నాయుడు, వై లలిత, జి సృజన ఆఫీస్ స్టాఫ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు విందుల నర్సింగరావు ముమ్మని అప్పారావు, ఎం శ్రీను, గొన్న తాతారావు, బొబ్బరి ప్రవీణ్ కుమార్, గోపిశెట్టి సత్య రావు, గొన్న గోపి, సలాది శ్రీనివాస, పినబాల మహేష్

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version