Home Politics Andhra Pradesh పెన్షన్లు పంపిణీ చేసిన గంటా

పెన్షన్లు పంపిణీ చేసిన గంటా

0

భీమిలి ఎగువపేటలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మందికి సామాజిక పెన్షన్లు అందిస్తున్నామని.. భీమిలి నియోజకవర్గంలో 44,866 మంది లబ్ధిదారులకు ఇస్తున్నామని వివరించారు. ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బందున్నా.. ప్రతి నెల క్రమం తప్పకుండా 1 వ తేదీ లేదా అంతకంటే ముందు రోజే పెన్షన్లు అందజేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు గాడు చిన్ని కుమారి లక్ష్మి, గంటా అప్పలకొండ, జడ్పీటీసీ గాడు వెంకటప్పడు, కూటమి నాయకులు కంటుభుక్త రామానాయుడు, గంటా నూకరాజు, సరగడ అప్పారావు, గొలగాని నరేంద్ర, పాసి నరసింగరావు తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version