మాడుగుల నియోజకవర్గంలో గల నాలుగు మండలాల్లో ఈనెల 15వ తేదీలోగా జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులన్నీ పూర్తి చేయాలని స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఎమ్మెల్యే కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఏ గ్రామానికి అయితే పల్లె పండగ 2.0 లో భాగంగా మూడు విడుదల లో ఇచ్చిన సిసి రోడ్లు పనులన్నీ 15 తేదీలోపు పూర్తి చేసి ఈనెల 20 వ తేదీలోపు పనులన్ని వర్క్స్ రికార్డింగ్ చేసుకోవాలని సూచించారు.
