Home Politics Andhra Pradesh తీరుతున్న ప్రయాణికుల కష్టాలు

తీరుతున్న ప్రయాణికుల కష్టాలు

0

మాడుగుల ప్రాంత ప్రజలు గత కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న రహదారి సమస్య ఎట్టకాలకు మరికొద్ది రోజుల్లో పరిష్కారం కానుంది. స్థానిక ఎమ్మెల్యే బంగారు సత్యనారాయణమూర్తి ప్రత్యేక తర్వాత వడ్డాది నుంచి తాటిపర్తి వరకు 23 కోట్ల రూపాయలతో ఈ రహదారి పనులు చురుకుగా సాగుతున్నాయి. మార్చినాటికి ఈ పనులు పూర్తవుతాయని ఎమ్మెల్యే తెలిపారు. మరో 30 సంవత్సరాల వెనక్కి చూడకుండా రెండు లేయర్లతో రోడ్డు నిర్మిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఎం కోటపాడు కేజే పురం మధ్యలో ఈ రహదారి నిర్మిస్తున్నారు. ఇప్పటికే తాటిపర్తి నుంచి ఎం కోటపాడు వరకు రోడ్డు వరకు రోడ్డు నిర్మాణం చేపట్టగా మిగిలిన రోడ్డుపన్నులు చురుకుగా సాగుతున్నాయి. గత ఏడు సంవత్సరాలు నుంచి ఈ రోడ్డు అస్తవ్యస్తంగా ఉండడంతో అనేక ప్రమాదాలు చోటుచేసుకోవడంతో పాటు వాహనదారులు బాట సారులు ఇబ్బందులకు గురవుతూ వస్తున్నారు. ఈ నేపద్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ప్రజల నుంచి వత్తిడి రావడంతో పాటు స్థానిక ఎమ్మెల్యే కూడా ప్రత్యేక దృష్టి సాధించారు. దీంతో ఈ రోడ్డుకు మహార్దశ పట్టింది. అలాగే ఘాటి రోడ్డు నుంచి మాడుగులకు కూడా రోడ్డు నిర్మించాలని మాడుగుల ప్రజలు కోరుతున్నారు. అయితే ఈ రహదారిని కూడా అభివృద్ధి చేసి నిర్మిస్తామని ఎమ్మెల్యే బండారు ఇటీవలే ఒక సమావేశంలో ప్రకటించారు. దీంతోపాటు పాడేరు నుంచి మాడుగుల,కే కోటపాడు మీదగా విశాఖకు తక్కువ సమయంలో చేరే విధంగా మరో రోడ్డు కూడా నిర్మించడం జరుగుతాదని ఎమ్మెల్యే తెలిపారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version