Home News పేదలందరికీ శాశ్వత నివాసమే ప్రభుత్వ ద్యేయం…

పేదలందరికీ శాశ్వత నివాసమే ప్రభుత్వ ద్యేయం…

0

భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ఆదేశానుసారం భీమిలి ఎగువపేట సచివాలయం పరిధిలో ఉండే లబ్ధిదారులకు శనివారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అనకాపల్లి నియోజకవర్గ సంస్థగత ఎన్నికల పరిశీలకుడు గంటా నూకరాజు చేతులమీదుగా ఇళ్ల పట్టాలు అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వలన రాష్ట్రంలో ఉండే ప్రతీ ఒక్కరూ స్వేచ్చావాయువును పీల్చుకున్నారని అన్నారు. ప్రజలకు ఏది అవసరమో అది అందిస్తూ, ఎటువంటి అభివృద్ధి రాష్ట్రంలో చేస్తే భావితరాలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయనే లక్ష్యంతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. భీమిలి నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నూతన ప్రణాళికలతో అడుగులు వేస్తున్నారని అన్నారు. ఆ అభివృద్ధి, సంక్షేమంలో భాగమే నేడు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ అని అన్నారు. పట్టాలు పంపిణీతో రాష్ట్రంలో పండగ వాతావరణం మొదలయిందని అన్నారు. ఉగాది నాటికి రాష్ట్రంలో 5 లక్షల మంది లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించాలనే లక్ష్యసాధనతో రాష్ట్ర ప్రభుత్వం ఉందని అన్నారు. ఆవిధంగా రాష్టంలో హోసింగ్ అధికారులు సిద్ధం అవుతున్నారని అన్నారు. ప్రతీ లబ్ధిదారుడు కుటుంబంతో సంతోషంగా ఉండాలనేదే మా ద్యేయమని గంటా నూకరాజు అన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version