ఆపద ఉన్నవారిని ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చెప్పారు. ఆఫీసుగా ప్రతి మూడు నెలలకు ఒకసారి రూపంలో ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సాయం అందిస్తున్నట్టు చెప్పారు. శుక్రవారం మాడుగుల పి ఫోర్ కార్యాలయంలో ఆయన లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగపరచుకోవాలని కోరారు. దరఖాస్తు చేసుకున్న వారికి మూడు నెలలు ఒకసారి చెక్కులు అందిస్తున్నామని ఆయన అన్నారు. ఇప్పటివరకు మాడుగుల నియోజవర్గంలో ఈ 18 మాసాలలో 226 మందికి కోటి 84 లక్షల 11 వేల 550 రూపాయలు సీఎం సహాయ నిధి కింద అందజేయడం జరిగిందని చెప్పారు. త్వరలో మరిన్ని చేక్కులు అందిస్తామన్నారు. ఈ సందర్భంగా మాడుగుల నియోజవర్గంలో గల నాలుగు మండలాల్లో 31 మందికి 16 లక్షల 13వేల 9o4 రూపాయల చెక్కులు అందిస్తున్నట్లు చెప్పారు. దాన్ని భాగంగా శుక్రవారం మాడుగుల మండలంలో 8 మందికి నాలుగు లక్షల 82 వేల 816 రూపాయలు, చీడికాడ మండలంలో 9 మందికి నాలుగు లక్షల పదివేల రూపాయలు చెక్కులు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పి అప్పల్రాజు, పెద్దేరు జలాశయ్య చైర్మన్ అద్దేపల్లి జగ్గారావు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పుప్పాల రమేష్, పట్టణ పార్టీ అధ్యక్షుడు పి లక్ష్మీనారాయణ, కార్యదర్శి వడ్డాది బాబు, పార్టీ నాయకులు కాశిబాబు ఉండూరు దేవుడు , విజయలక్ష్మి, చే
సిహెచ్ త్రిమూర్తి, కే నానాజీ, తదితరులు పాల్గొన్నారు.
