Home Politics Andhra Pradesh శివరాత్రి ఉత్సవ పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

శివరాత్రి ఉత్సవ పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

0

ఈ నెల 15వ తేదీన మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో చోడవరం స్వయంభు గౌరీశ్వర స్వామి వారి ఆలయంలో నిర్వహిస్తున్న శివరాత్రి ఉత్సవ పోస్టర్ను స్థానిక ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ రాజు శుక్రవారం ఆవిష్కరించారు. ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు ఈ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ శివరాత్రి ఉత్సవాలను ప్రజలంతా జయప్రదం చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. అతి పురాతనమైన ఈ శివాలయం ఎంతో ప్రాముఖ్యతతో కూడుకుందని శివరాత్రి ఉత్సవాలు ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తుంటామని,ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహిస్తామన్నారు. కాబట్టి భక్తులందరూ ఈ ఉత్సవాలు జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఆలయానికి గునూరు సురేష్ చైర్మన్గా, కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎస్ వి వి సత్యనారాయణమూర్తి, ప్రధాన అర్చకులు కొడమంచిలి చలపతి వ్యవహరిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే గౌరవ అధ్యక్షులుగా ఉంటూ కమిటీగా చేదోడు వాదోడుగా సహకార అందిస్తుంటారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version