Saturday, April 18, 2026
HomePoliticsAndhra Pradeshగ్రామానికి ఒక పారిశ్రామికవేత్త లక్ష్యం: కలెక్టర్ కీర్తి చేకూరి

గ్రామానికి ఒక పారిశ్రామికవేత్త లక్ష్యం: కలెక్టర్ కీర్తి చేకూరి

మహిళల ఆర్థికాభివృద్ధి కోసం వార్షిక రుణ మరియు జీవనోపాధి కార్యాచరణ ప్రణాళిక ను సమర్థవంతంగా అమలు చేసి ప్రతి గ్రామంలో కనీసం ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు.
స్థానిక సైన్స్ పార్క్‌లో జరిగిన శిక్షణా కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, పీఎంఈజీపీ/పీఎంఎఫైఎంఈ కింద 500 యూనిట్ల స్థాపనకు బ్యాంకుల మద్దతు పెంపొందించాలన్నారు. కోవిడ్ అనంతరం విద్యార్థుల్లో గ్రహణ శక్తి తగ్గిందని, ముఖ్యంగా ప్రాథమిక గణిత నైపుణ్యాల్లో లోపాలు ఉన్నాయని తెలిపారు. జీఎస్ ఎల్ ద్వారా కాన్సెప్ట్ ఆధారిత బోధనకు ప్రాధాన్యం ఇవ్వాలని, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డి.ఆర్.డి.ఏ అధికారులు, విద్యాశాఖ ప్రతినిధులు, బ్యాంకర్లు, జిల్లా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments