విశాఖ డాక్టర్స్ క్రికెట్ లీగ్ సీజన్ -2 పోటీల పోస్టర్ ను, కప్ ను మధురవాడలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య వృత్తిలో నిత్యం బిజీగా ఉండే డాక్టర్లకు క్రీడలు ఉపశమనం కలిగిస్తాయని పేర్కొన్నారు. ఈనెల 25 నుంచి 29 వరకు రైల్వే, పోర్టు గ్రౌండ్స్ లో జరిగే క్రికెట్ పోటీల్లో 14 జట్లు పాల్గొంటున్నాయని నిర్వాహకులు గంటాకు తెలియజేశారు. కార్యక్రమంలో వి.డి.సి.సి. చైర్మన్ డాక్టర్ కృష్ణ కిషోర్, డాక్టర్ రామానుజం, డాక్టర్ అచ్యుత్, డాక్టర్ రేవంత్ పాల్గొన్నారు.
డాక్టర్స్ క్రికెట్ లీగ్ కప్ ను ఆవిష్కరించిన గంటా
RELATED ARTICLES
