Home Politics Andhra Pradesh జాబ్ క్యాలెండరు ఘనత లోకేష్ దే…!

జాబ్ క్యాలెండరు ఘనత లోకేష్ దే…!

0

వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్

యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనలో విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కృషి అభినందనీయమని వి ఎం ఆర్ డీ ఏ చైర్మన్ ఎం.వి. ప్రణవ్ గోపాల్ అన్నారు. విశాఖ లో గురువారం ఆయన మీడియాతో మాటాడుతూ ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సీ ద్వారా 16వేల ఉపాధ్యాయ నియామకాలు చేపట్టినందుకు నిరుద్యోగ యువత తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నమన్నారు. డీఎస్పీ ప్రకటించినందుకు నిరుద్యోగుల తరుపున, జాబ్ క్యాలెండర్ ద్వారా పారదర్శక నియామక ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఘనత విద్యా శాఖ మంత్రి లోకేష్ దే నని పేర్కొన్నారు. విద్యా రంగ సంస్కరణల్లో ఆయన నాయకత్వం రాష్ట్రానికి దిశానిర్దేశం చేస్తోందని,
ఐటీ మరియు నైపుణ్యాభివృద్ధి రంగాల్లో కొత్త అవకాశాలు సృష్టిస్తున్న కూటమి ప్రభుత్వం పట్ల యువత ఆసక్తిగా ఉందన్నారు. యువత ఆశయాలను నిజం చేసే నిజమైన నాయకులు మంత్రి లోకేష్ అని, అభివృద్ధి, ఉపాధి, పారదర్శక పాలన, విశాఖ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version