పీఎం జన్మన్ రెండో విడత గృహప్రవేశం*
రాష్ట్రవ్యాప్తంగా 19,963 ఇళ్లను పిఎం జన్మన్ పథకం కింద రెండో విడతలో కూటమి ప్రభుత్వం దిగ్వజంగా గృహప్రవేశం కార్యక్రమం చేస్తున్న తరుణంలో మండల కేంద్రం పరిధిలోగల సాగర పంచాయతీ ముగిరిగుడ గ్రామంలో హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర వేతనాల సలహా మండలి డైరెక్టర్ టీ.సుబ్బారావు, స్థానిక ఎంపీడీవో విశ్వనాథం,పిఎన్ జన్మన్ నూతన గృహాలను సోమవారం టిడిపి శ్రేణులు నాయకులు రూబెన్ కట్ చేసి గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా పలుచోట్ల 20000 గృహాలు నిర్మాణం పూర్తి అయిందన్నారు. 300 మందికితో గృహప్రవేశం చేపట్టడం జరిగిందన్నారు
ఈ పథకంలో భాగంగా పేదల ఇల్లు నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, ఇళ్లస్థలం ఉచితంగా ఇస్తుందని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ పివిటిజిలకు 50 వేల నుంచి లక్ష వరకు అదనపు ఆర్థిక సహకారం అందిస్తుందని చెప్పారు. పేదవారి సొంత ఇంటి కళ నెరవేరాబోతున్న రోజు అని చెప్పారు.పేదలకు అండగా తోడుగా ఉండే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని పేర్కొన్నారు. ఒకపక్క అభివృద్ధి మరోపక్క సంక్షేమ పథకాలు సమంతరంగా చేస్తున్న ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వమే అని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో కూటమి ముఖ్య నాయకులు సర్పంచులు, ఎంపీటీసీలు క్లస్టర్ నాయకులు కార్యకర్తలు, గ్రామస్తులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
