Home News ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అకాడమిక్ ఆడిట్ “

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అకాడమిక్ ఆడిట్ “

0

స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈ విద్యా సంవత్సరం అకాడమిక్ ఆడిట్ సోమవారం ప్రారంభించారు. వి ఎస్ కే గవర్నమెంట్ డిగ్రీ కళాశాల నుంచి డాక్టర్ విజయ ప్రతాప్, ఎలమంచిలి గవర్నమెంట్ డిగ్రీ కళాశాల నుంచి ఎం కిషోర్ ఆడిట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి కిరణ్ కుమార్ ఆడిట్ అధికారులకు సహకరించారు. ఐక్యూ ఏసీ సమన్వయకర్త డాక్టర్ నారాయణ మూర్తి ఆధ్వర్యంలో డాక్టర్ విజయ ప్రతాప్, బోటనీ, జువాలజీ ,కెమిస్ట్రీ, ఫిజిక్స్, పీజీ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్, కళాశాల గ్రంధాలయం సందర్శించి ఎన్ ఎ ఎ సి మోడల్ ఆడిట్ రికార్డులను అన్నింటిని లోతుగా పరిశీలించారు. ఎం కిషోర్ హ్యుమానిటీస్ డిపార్ట్మెంట్స్ కామర్స్, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఈ ఎల్ ఎల్ కంప్యూటర్ ల్యాబ్, స్కిల్ హబ్ ల్యాబ్ యొక్క రికార్డులు, ఎన్ఎస్ఎస్ మూడు యూనిట్స్, ఎన్సిసి, మౌలిక వసతులు వివిధ రకాలైనటువంటి అంశాల పైన తనిఖీలు నిర్వహించారు.విద్యార్థులకు కల్పించిన వసతులు, త్రాగునీరు, టాయిలెట్ విషయాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రిన్సిపాల్ అధ్యాపకుల సమావేశము లో కళాశాల అభివృద్ధికి తీసుకోవలసిన పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమాలను సమన్వయకర్త డాక్టర్ నారాయణ మూర్తి, జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ రత్నభారతి, డి.మాల్యాద్రి,బి.పిచ్చమ్మ, సీనియర్ అధ్యాపకులు హెచ్ సుదీర్, వి.అప్పలనాయుడు, డాక్టర్ కృష్ణారావు, డాక్టర్ రాధాకృష్ణ, డాక్టర్ జ్యోతి, డాక్టర్ సంధ్య శ్రీ, డాక్టర్ సూర్యవతి, డాక్టర్ వాసు దేవరాజు, డాక్టర్ శ్రీవెంకటేష్,సరస్వతీ, రామలక్ష్మి, కోమల, కామర్స్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version