Home Politics Andhra Pradesh విద్యా విధానంలో లోకేష్ తీసుకొస్తున్న మార్పులు అభినందనీయం . ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ

విద్యా విధానంలో లోకేష్ తీసుకొస్తున్న మార్పులు అభినందనీయం . ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ

0

శాసనమండలి సభ్యురాలు కర్రీ పద్మశ్రీ నారాయణరావు 29 గురువారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిసి ఆయన విద్యావ్యవస్థ పై తీసుకుంటున్న నిర్ణయాలు రాబోయే తరాల విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఏర్పాటు అవుతుందని తమ అభిప్రాయం లోకేష్ కు తెలిపామని ఎమ్మెల్సీ పద్మశ్రీ అన్నారు. అలాగే విద్యార్థులకు ఏ విధంగా మంచి జరుగుతుందో వారిని సూచనలు సలహాలు ఇవ్వవలసిందిగా లోకేష్ ఆదేశించినట్టు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థులకు వారి ప్రతిభను నిరూపించుకునేందుకు ప్రభుత్వం తరఫున చేస్తున్న స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం, మధ్యాహ్న భోజన పథకంలో తీసుకువచ్చిన మార్పులపై ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నట్టు లోకేష్ కి తెలుపమని అలాగే కాకినాడJNTUK యూనివర్సిటీ , ఆదికవి నన్నయ యూనివర్సిటీ, వంటి యూనివర్సిటీలో విద్యార్థులు వారి ప్రతిభను బట్టి చదువుకునే విధంగా కోర్సులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పామని దీన్ని పరిశీలించి అమల్లో పెడతామని లోకేష్ అన్నారు కర్రి పద్మశ్రీ నారాయణరావు ఒక ప్రకటనలో తెలిపారు.
మీ మార్గదర్శకత్వంలో అమలవుతున్న యువత కోసం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, వృత్తి మార్గదర్శక కార్యక్రమాలు, మెగా తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమావేశాలు, ఆరోగ్యం మరియు పరిశుభ్రత కోసం ముస్తాబు కార్యక్రమం, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం బలోపేతం, అలాగే 10వ తరగతి, ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న జాబ్ మేళాలు అత్యంత ప్రశంసనీయమైనవి.
తీర ప్రాంతంలో నివసిస్తున్న సాంప్రదాయ మత్స్యకారులు, మత్స్యకారుల కుటుంబాల్లో విద్యావంతులకు తగిన విధంగా ఉద్యోగ అవకాశాలు, స్కిల్ డెవలప్మెంట్ గురించి సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version