వైస్సార్సీపీ ఎంబీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు పెండ్ర వీరన్న
నరసాపురం నియోజకవర్గం నరసాపురం మండలం, సీతారామపురం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని గత 15 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది మార్చి 30 వ తేది సోమవారం రాత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం పై దాడి చేసి ఎడమ చేతిని విరగగొట్టడం జరిగింది, సమీపంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న బ్యానర్ను కూడా చించేయడం జరిగింది* ఈ విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ పార్టీ గ్రామ కమిటీ మంగళవారం నిరసన కార్యక్రమానికి తెలిపారు ఈ కార్యక్రమానికి *ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంబీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు, ఆ పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెండ్ర వీరన్న* పాల్గొని మాట్లాడుతూ దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం పై దాడి చేసి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బ్యానర్ను చింపేసిన దుండగులను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు పది రోజుల్లో దుండగులను అరెస్టు చేయకపోతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ధర్నాకు దిగుతామని హెచ్చరించారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం అభివృద్ధి అనే అంశాలను పక్కనపెట్టి ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలను పక్కనపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులపై దాడులు చేయటం కేసులు పెట్టడం తప్ప ప్రజా సంక్షేమ పాలన మీద దృష్టి లేదని ఆయన అన్నారు, గతంలో ఇప్పుడు విగ్రహాలపై దాడి చేసే సంస్కృతి నియోజకవర్గంలో లేదని కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త సంస్కృతిని ప్రారంభించారని ఇది ఇలాగే కొనసాగితే చూస్తూ ఊరుకోబోమని ఆయన ఖండించారు, దుండగులను శిక్షించాలని పోలీసు వారికి వినతిపత్రాన్ని అందచేసారు ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
