జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ,పర్యాటకులు,ప్రజల భాగస్వామ్యంతో,అధికారుల సమన్యాయంతో మూడు రోజుల పాటుఘనంగా అరకు చలి ఉత్సవ్ ను అత్యంత వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఏ ఎస్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా అధికారులతో అరకు చలి ఉత్సవ్ 2026 నిర్వహణ ఏర్పాట్లు పై ముందస్తు సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అరకు అందాలను ప్రపంచానికి చాటిచెప్పేలా, స్థానిక సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ వేడుకలు ఉండాలని పేర్కొన్నారు. ప్రతి విభాగం సమన్వయంతో పనిచేసి పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.
మొదటి రోజు 30 జనవరి 2026 అడ్వెంచర్ మరియు కాంటెంపోరారీ కల్చర్
సాహస క్రీడలు, ట్రెకింగ్ మరియు ఆధునిక సాంస్కృతిక ప్రదర్శనలతో ఉత్సవాలు
ప్రారంభమవుతాయి. పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రత్యేక అడ్వెంచర్ జోన్‌లను ఏర్పాటు చేయనున్నారు.
రెండవ రోజు 31 జనవరి 2026 యూత్, స్పోర్ట్స్ మరియు ట్రైబల్ లైఫ్ స్టైల్
యువత కోసం ప్రత్యేక క్రీడా పోటీలు నిర్వహిస్తారు. గిరిజన జీవనశైలిని ప్రతిబింబించేలా ప్రదర్శనలు, గిరిజన కళారూపాలు మరియు సంప్రదాయ వంటకాల ప్రదర్శనలు, స్ట్రాల్స్ ఏర్పాట్లు ఉంటాయి.
మూడవ రోజు 01 ఫిబ్రవరి : ముగింపు వేడుకలు స్థానిక కళాకారుల ప్రదర్శనలు మరియు బహుమతి ప్రధానోత్సవంతో ఉత్సవాల కార్యక్రమాలు ఉంటాయన్నారు.ఉత్సవాలకు వచ్చే పర్యాటకుల కోసం రవాణా, తాగునీరు, మరియు భద్రతా ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు ఉండకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు.
